సికింద్రాబాద్ రావాల్సిన 'వందేభారత్‌'లో సాంకేతిక లోపం

20-09-2026 | 07:10am

హైదరాబాద్: వందేభారత్ రైలులో సాంకేతిక లోపం(Technical glitch) తలెత్తడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆదివారం ఉదయం 5.35 గంటలకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్(Visakhapatnam to Secunderabad) రావాల్సిన వందే భారత్ రైలులో సాంకేతిక లోపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వందే భారత్ రైలును అధికారులు విశాఖ రైల్వేస్టేషన్ లోని 8వ ఫ్లాట్ ఫాంపై నిలిపివేశారు. సాంకేతిక లోపానికి గల కారణాలపై రైల్వే సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు