హెల్త్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా తెలంగాణ

22-09-2026 | 05:20am
  1. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
  2. కొత్త తరహా ఆలోచనలకు ప్రభుత్వం ప్రోత్సాహం
  3. హోమా సీఎంఈ 2026’ జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌(Health Innovations)కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గల ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు, స్టార్టప్ సామర్థ్యాల(Startup capabilities)ను హెల్త్ కేర్‌తో అనుసంధానం చేసేలా కాంప్రహెన్సివ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం(Comprehensive Innovation Ecosystem)ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీ- ‘బయాండ్ నంబర్స్-ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర్’ అనే అంశంపై ‘హోమా సీఎంఈ 2026’ పేరిట నిర్వహించిన జాతీయ సదస్సును ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మెడిసిన్‌ను టెక్నాలజీతో మిళితం చేస్తున్నామన్నారు. మారుతున్న ఆధునిక జీవనశైలి(Modern lifestyle) కారణంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. వీటిని కేవలం సాంప్రదాయ వైద్య విధానాలతోనే కాకుండా, లైఫ్‌స్టైల్ డేటాను విశ్లేషించడం ద్వారా సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని తెలిపా రు.

ఈ తరహా దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించాల్సిన అవసరముంద న్నారు. ఆ దిశగా మరిన్ని నూతన ఆవిష్కరణలు రావాలన్నారు. రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ రంగం(Healthcare sector)లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే కొత్త ఆలోచనలకు తమ ప్రభు త్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వైద్య నిపుణులు, పరిశోధకులు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందు కు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.

ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డా.ముద్దు సురేంద్ర నె హ్రు రచించిన ‘ది న్యూ పారాడైమ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రపంచంలో నే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్ ప్లోరర్’ను ప్రారంభించారు. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(పీవోసీ)’ పేరిట ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఎంపిక చేసిన 50 మంది రోగులకు ఉచిత ప్రొటోకాల్‌ను అందించే కార్యక్రమానికీ మంత్రి శ్రీకారం చుట్టారు.

మరిన్ని వార్తలు