హెచ్‌సీఏ కేసులో జాప్యంపై టీసీఏ ఆవేదన

06-10-2026 | 05:05am
  1. న్యాయాన్ని బందీగా ఉంచలేరని వ్యాఖ్య
  2. న్యాయ ప్రక్రియను వ్యూహాత్మకంగా వాడుతున్నారని ఆరోపణ

హైదరాబాద్, అక్టోబర్ 5 : తెలంగాణలో క్రికెట్ భవితవ్యంపై కొనసాగుతున్న న్యాయపోరాటానికి సంబంధింది హెచ్‌సీఏ(HCA) కాల యాపన చేస్తుండటంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) (టీసీఏ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తుది తీర్పు రాకుండా అడ్డుకోవడానికి, దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన య థాతథ స్థితిని కాపాడుకోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) అందుబాటులో ఉన్న ప్రతి విధానపరమైన మార్గాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.

టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి(Dharam Guruva Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువ క్రికెటర్ల క్రీడా హక్కులు, ఆశయాలతో ముడిపడి ఉన్న ఈ వివాదం ఎం తకాలం వాయిదాలు, లిస్టింగ్లు, మధ్యంతర విచారణల చక్రబంధంలో మగ్గిపోవాలని ప్రశ్నించారు.  ఈ సమస్య బాంబే హైకోర్టు లో ఉన్న రిట్ పిటిషన్‌కి సంబంధించిన దని గుర్తు చేశారు. హైదరాబాద్ వెలుపల క్రికెట్ అభివృద్ధికి సంబంధించి హెచ్‌సీఏ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరపాలని బీసీసీఐ జూలై 11, 2021 నాడే ఆదేశించినట్లు కోర్టు తన జనవరి 27, 2026 నాటి ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు.

ఆ తర్వాత కోర్టు నిర్దిష్ట కాలపరిమిసితో కూడిన కొత్త రాజీ ప్రయత్నానికి ఆదేశిస్తూ, తదుపరి విచారణకు జాబితా చేసిందన్నారు. రిటైర్డ్ జస్టిస్ పి. నవీన్ రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ నివేదికను పరిశీలించిన కోర్టు, ఈ కే సుకు సంబంధించి విచారణను 2026 ఏప్రి ల్ 23కి వాయిదా వేసిందని గుర్తు చేశారు. ఏళ్లు గడుస్తున్నా, వాదనలు పెద్దఎత్తున పూ ర్తయినా, ప్రధాన వివాదం మాత్రం ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని టీసీఏ ఆగ్ర హం వ్యక్తం చేసింది. దీనికి హెచ్‌సీఏ తీరే కారణమని మండిపడింది.

రాష్ట్రంలో క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించే మూల సమస్య అలాగే ఉండిపోతుంటే, తెలంగాణ ప్రజలు అంతులేని వాయిదాల పర్వాన్ని మూగగా భరించాలని ఎవరూ ఆశించలేరని గురువారెడ్డి వ్యాఖ్యామించారు. ప్రక్రియ పరమైన వరుస పరిణామాలు, పిటిషన్ల వల్ల ప్రధాన వివాదంపై విచారణను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయ న ఆరోపించారు.రాష్ట్రంలో 33 జిల్లాలు ఉ న్నాయని, పోటీ క్రికెట్లోకి ప్రవేశించాలనుకునే ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు ఉన్నారని, ఇలాంటి సమయం లో క్రికెట్ అభివృద్ధి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకూడదని పేర్కొంది.

మరిన్ని వార్తలు