సీపీకి కోర్టు నోటీసులు!

03-10-2026 | 08:45am

సీపీ సజ్జనార్‌(CP Sajjanar)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్(FIR) లేకున్నా.. హైదరాబాద్ భవానీనగర్‌ పోలీసులు తన చేతులు, కాళ్లు కట్టేసి.. కళ్లల్లో కారం చల్లి కొట్టారంటూ తలాబ్‌ కట్టకు చెందిన షానవాజ్‌ ఆలం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్(CCTV Footage)ను పరిశీలించి.. సంబంధిత పోలీసులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది.

అయితే.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సీపీ ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపిస్తూ.. షానవాజ్‌ ఆలం కోర్టు ధిక్కరణ పిటిషన్‌(Contempt Petition) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరిపిన జస్టిస్‌ టీ. మాధవీదేవి ధర్మాసనం.. సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సంబంధిత అంశంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది..

మరిన్ని వార్తలు