ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం..
17-09-2026 | 06:22pm
తాడ్వాయి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం బిజెపి నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రామ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తాడ్వాయి మండల శాఖ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మర్రి బాపురెడ్డి, గంగారెడ్డి, నాయకులు రవీందర్ రావు,హోటల్ శ్రీను, తిరుపతిరెడ్డి, నర్సింలు, దత్తాత్రి, రవీందర్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.