అభివృద్ధి పథంలో తెలంగాణ

18-09-2026 | 05:15am
  1. హరిత ఇంధనంగా రాష్ట్రం
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  3. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
  4. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  5. ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఖమ్మం/రంగారెడ్డి/మహబూబాబాద్/మంచిర్యాల, సెప్టెంబర్ -17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం (Telangana Public Administration Day)సందర్భంగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన తెలంగాణ 1,000 రోజుల ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.

ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఉద్యమించిన యోధుల వెలకట్టలేని త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం పూర్తి చేసుకున్న పాలనలో పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. తెలంగాణ అమరవీరులు జర్పుల సురేష్, మీనా వేణు, వెంపడి రామకృష్ణ, ఎస్కే. మహమూద్ పాషా, యన్మందుల వేణుగోపాల్‌ల కుటుంబసభ్యులను సత్కరించారు.

అనంతరం వ్యవసాయ, ఉద్యానవన, డిఆర్డిఎ, సంక్షేమం, వైద్య ఆరోగ్య, అటవీ, విద్యా, ఎస్సీ/ఎస్టీ/బిసి/మైనారిటీ సంక్షేమం, విద్యుత్, సైబర్ నేరాలు, టిజి ఆర్టీసీ, పౌరసరఫరాలు, మోడల్ స్కూల్స్ శాఖలచే ఏర్పాటుచేసిన స్టాళ్లను డిప్యూటీ సిఎం పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాంమూర్తి పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కొంగరకలాన్) వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలు, రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం వంటి సంక్షేమ ఫలాలను అర్హులందరికీ పారదర్శకంగా అందిస్తున్నామని వివరించారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ అమరులు శేఖర్ రెడ్డి, సిరిపురం యాదగిరి, కాకి కుమార్, దినేష్ చంద్రల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీయూఎఫ్‌ఐ డిసీ ఛైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కిరణ్మయి, డీఎఫ్‌ఓ శివ ఆశిష్ సింగ్, డీసీపీ బి. రాజేశ్, డిఆర్‌ఓ శారద దేవి, ఏవో సునీల్ పాల్గొన్నారు.   

రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేవారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు మంచిర్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ లతో జాతీయ జెండావిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ ఆలీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు