కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

17-09-2026 | 03:39pm

ముఖ్య అతిథిగా హాజరైన మైనారిటీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అజారోద్దీన్

కోరుట్ల/జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌(Jagtial District Collectorate)లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు(Telangana prajapalana dinotsavam celebrations) ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి అజాహారుద్దీన్(Public Enterprises Minister Mohammad Azharuddin) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం(Public welfare), రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

జగిత్యాల జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards), చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, మహిళా సంఘాలకు రుణాలు తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల అభివృద్ధిలో భాగంగా 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

మరిన్ని వార్తలు