రుద్రంగిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
రుద్రంగి(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) రుద్రంగి మండలకేంద్రంలో తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవం(Telangana prajapalana dinotsavam)లో భాగంగా ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ చెలుకల తిరుపతి, గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ గండి నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా ప్రజాపలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడిన తర్వాత ప్రజాపాల వచ్చిందని ప్రజాపలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజాపలన చేపట్టిన ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.