తెలంగాణకు రెయిన్ అలర్ట్

19-09-2026 | 03:49pm

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రం 5 గంటలలోపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు పేర్కొంది.

జనగామ, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నిర్మల్, నాగర్‌కర్నూల్, మెదక్, మంచిర్యాల, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు