తెలంగాణలో భారీవర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

22-09-2026 | 07:56am

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం, ఈదురుగాలుల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.

మరిన్ని వార్తలు