ఛార్జీల పెంపుతో ప్రజల జేబుకు ప్రభుత్వం చిల్లు

13-09-2026 | 05:10am
  1. ఇది ప్రజాపాలన కాదు.. దోపిడీ పాలన
  2. మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : ఆర్టీసీ ఛార్జీల(RTC fares) పేరుతో ప్రజల జేబులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) చిల్లు పెట్టడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శిం చారు. ప్రయాణికులు పంపిన బస్ టికెట్స్(Bus tickets) శనివారం ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. హైదరాబాద్-హన్మకొండ(Hyderabad-Hanmakonda) ఏసీ బస్సు ఛార్జీ ఆగస్టు 20న రూ.410 ఉం టే.. సెప్టెంబర్ 11న ఏకంగా రూ.570కు పెం చారని, కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం మోపారని వెల్లడించారు.

ఎలాంటి ముంద స్తు ప్రకటన లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఛార్జీలు పెంచడం ఎంతవరకు స మంజసం? అని ప్రశ్నించారు. ఇది ప్రజాపా లన కాదు..  దోపిడీ పాలన అని మండిపడ్డా రు. మాటల్లో ఉచితాలు.. చేతల్లో ఛార్జీల మో త అని ఎద్దేవా చేశారు. ప్రజలపై భారం మో పడం ఆపి, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.   

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత దుర్మార్గం 

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20- 25 ఏళ్లుగా సేవల ందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేత నాల్లో కోత విధించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రేటర్ వరంగ ల్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ మాటల్లో కోత లు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పే ప్రజాపాలన? అని ప్రశ్నిం చారు. మున్సిపల్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 12.07.2026 నాటి జీవో నెం. 1181 ఉద్యోగు ల పాలిట శాపంగా మారిందన్నారు. ఇన్నేళ్లు గా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, అనుభవాన్ని గుర్తించా ల్సింది పోయి.. కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయమని మండిప డ్డారు. 

మరిన్ని వార్తలు