వెల్ డన్ యాదగిరి..!

23-09-2026 | 10:11pm

జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్ 

అభినందించిన జిల్లా కలెక్టర్ ప్ర‌తీక్ జైన్

సంగారెడ్డి, సెప్టెంబ‌ర్ 23: వెల్ డన్ యాదగిరి.. గుడ్ జాబ్ అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(District Collector Prateek Jain) అభినందించారు. నేనే మీకు శాలువా కప్పాలి అంటూ శాలువాతో సత్కరించారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని యాదగిరికి అందజేశారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదిన పురస్కరించుకొని మంగళవారం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొనాల్సి ఉండ‌గా అత్యవసర పనుల వల్ల ఆయన పాల్గొనలేకపోయారు. దీంతో బుధవారం యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ను కలిశారు. నోట్‌ పుస్తకాలను అందించారు. రక్తదాన శిబిరం ద్వారా సమాజానికి సేవా నిరతిని చాటి చెప్పడం గ్రేట్ అని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి మెసేజ్ వెళుతుందని అన్నారు. పుట్టినరోజునాడు కేక్ కటింగ్ తో వేడుకలు జరపకుండా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

నిత్యం సమాజంలోని వార్తలను వెలికి తీస్తున్న జర్నలిస్టుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరగడం మరింత శుభ సూచకమని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిపిఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రభాకర్, చిన్నా, మధ్యతరగతి పత్రికల సంఘం ఉపాధ్యక్షుడు నజీర్, కోశాధికారి లక్ష్మణ్, రథసారథి సీఈవో సంతోష్ గౌడ్, ఆంధ్రజ్యోతి శ్రీకాంత్, టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇర్షాన్, విజయ రాజు, మహేష్ ,శ్రీకాంత్, సాక్ష్యం శ్రీనివాస్, నవీన్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు