నాని కెరీర్లో కొత్త రికార్డ్!
నాని ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్‌ను(The Paradise Worldwide Collection) షేక్ చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో(Nani Srikanth Odela Movie) తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చి ఓపెనింగ్ డే నుంచే భారీ వసూళ్లతో వార్తల్లో నిలిచింది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే కనిపించగా.. విడుదల తర్వాత కూడా సినిమాకు బలమైన బాక్సాఫీస్ స్పందన నమోదైంది. SLV సినిమాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ప్రకటించింది.
ఈ కలెక్షన్‌తో నాని(Nani The Paradise) కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్గా నిలిచిందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే నాని గత చిత్రాల ఓపెనింగ్ రికార్డులను అధిగమించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ రన్‌పై ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణలో 'ప్యారడైజ్' అత్యంత భారీ ఆరంభాన్ని సొంతం చేసుకుంది. ప్రీమియర్లతో కలిపి ₹23.1 కోట్ల గ్రాస్ (Gross) GST మినహాయించి మొదటి రోజు ₹13.3 కోట్ల షేర్ (Share) సాధించింది.