సెకండ్ హాఫ్ దుమ్ము దులిపేస్తుంది

08-09-2026 | 05:30am

సుమంత్(Sumanth), ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్(Spiritual Mystery Thriller) ‘మహేంద్రగిరి వారాహి’(Mahendragiri Varahi). స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రత్యేక పాత్ర లో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్(Raja Shyamala Entertainments), బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, హీరో అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. “ఇది ప్రేక్షకులు థియేటర్లో చూడదగ్గ సినిమా అనిపిస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుందని నమ్మకం ఉంది” అన్నారు. ‘మహేంద్రగిరి వారాహి అద్భుతమైన సినిమా’ అని హీరో సిద్దు జొన్నలగడ్డ చెప్పారు. చిత్ర కథానాయకుడు సుమంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా వెను క ఏదో శక్తి ఉన్నట్టు మేము ఫీలయ్యాం. సెప్టెంబర్ 11న మా కష్టార్జితం మీరు తెరపై చూడబోతున్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ దుమ్ముదులిపేస్తుం ది” అని తెలిపారు.

డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. “అఖిల్ మా లక్కీ చార్మ్. ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ ఆయనే లాంచ్ చేశారు. దానికి చాలా మంచి పేరు, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి పది రెట్లు వస్తాయని కోరుకుంటున్నా” అని చెప్పారు. నిర్మాత మధు మాట్లాడుతూ.. “ఈ సినిమా చేయడం నిర్మాతలుగా మా అదృష్టం.

‘రంగమార్తండ’తో ఒక అడుగు ముందుకు వెళ్లాను. ఈ సినిమాతో మరో 10 అడుగులు ముందుకు వెళ్తానని నమ్ముతున్నా” అని తెలిపారు. నటీనటులు బ్రహ్మానందం, అలీ, మీనాక్షి గోస్వామి, మంజు భార్గవి, మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్, గీత రచయిత కాసర్ల శ్యామ్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు