ఓట్లు బీసీలవి.. సీట్లు ఎవరివి?
బీసీ ఓటు.. ఎన్నికలు వచ్చినప్పుడ ల్లా పార్టీలకు ముందుగా గుర్తుకువచ్చేది ఇదే! బీసీల సంక్షేమం(Welfare of BCs), అభివృద్ధి, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం (Political representation)వంటి అంశాల చుట్టూ అవి హామీ లు గుప్పిస్తుంటాయి. కానీ, ఎన్నికలు ము గిశాక పరిస్థితి ఏమిటి? మళ్లీ కథ మొదటికి! ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతిసారీ.. బీసీలకు లభిస్తున్న రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయాధికారం, ఆర్థిక అవకాశాలపై ప్రశ్నలు ముందుకు వస్తూనే ఉ న్నాయి.
జనబలం ఉన్న సమాజం తన హ క్కులను సమర్థవంతంగా సాధించుకోవడానికి అవసరమైన ఆలోచనా పునాది ఏ మిటన్నది ఇప్పుడు చర్చించాల్సిన ప్రధాన అంశం. ఓటు బలం ఒక్కటే అధికార భాగస్వామ్యానికి హామీ ఇవ్వదు. అభ్యర్థుల ఎంపిక, పార్టీల అంతర్గత నిర్మాణం, ఎన్నికల వనరులు, విద్య, ఆర్థిక స్థితి, సామాజిక ప్రభావం, నాయకత్వ అవకాశాలు వంటి అంశాలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల బీసీ సమాజం తన రాజకీయ పరిస్థితిని భావోద్వేగాలతో కాకుండా, వాస్తవ పరిస్థితుల ఆధారంగా విశ్లేషించుకోవాలి.
లోటెక్కడ?
గ్రామాల్లోని అనేక కుటుంబాలు విద్య, ఉపాధి, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వె నుకబాటుతనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తమకు అందాల్సిన ప్ర భుత్వ పథకాలు ఏమిటి? రిజర్వేషన్ల ద్వా రా లభించే అవకాశాలు ఏవి? రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎలా వినియోగించుకోవాలి? అనే విషయాలపై ప్రతి ఒక్కరి కీ సమగ్ర అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన లోపం ప్రజల హక్కుల సాధనకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
అందువల్ల బీసీ ఉద్యమం.. సభలు, సమావేశాలు, నినాదాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు, విద్యా మార్గదర్శక కేంద్రా లు, ఉపాధి సమాచారం, ప్రభుత్వ పథకాలపై ప్రజా చర్చలను చేపట్టాలి. బీసీ సమా జంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే విద్య, ఉపాధి, ఆదాయం, వృ త్తులు, ఆస్తులు, సామాజిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యంపై ఆధారాలతో కూడిన అధ్యయనాలు అవసరం. ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించడం ఉద్యమం ప్రాథమిక బాధ్యతగా మారాలి.
రిజర్వేషన్.. ప్రకటనలకేనా?
తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో సముచిత రిజర్వేష న్లు కల్పించాలనే డిమాండ్లు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యంతో ముడిపడి ఉన్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయ నిపుణుల మధ్య విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రతి నిర్ణయం రాజ్యాంగ నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియ, న్యాయస్థానాల మార్గదర్శ కాలకు అనుగుణంగా ఉండాలి.
రిజర్వేషన్ అనేది ఒక సంఖ్య లేదా శాతం గురించి మాత్రమే కాదు. దాని వెనుక చారిత్రక అసమానతలు, విద్యా అవకాశాల లోటు, ఉపాధిలో వెనుకబాటుతనం, సామాజిక ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధి, రాజ్యాంగ హక్కులు వంటి విస్తృత అంశాలు ఉన్నా యి. అందువల్ల బీసీ రిజర్వేషన్లపై చర్చ రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుం డా... ఆధారాలతో కూడిన అధ్యయనం, పారదర్శక విధాన రూపకల్పన, చట్టపరమైన స్పష్టత, సమర్థవంతమైన అమలు దిశగా సాగాలి.
సిద్ధాంత భావజాలం ఎక్కడ?
ఒక నినాదం ప్రజలను కదిలించగలదు. ఒక డిమాండ్ ఉద్యమానికి ఆరంభం కావ చ్చు. కానీ, దీర్ఘకాలిక సామాజిక మార్పునకు స్పష్టమైన సిద్ధాంతం, లక్ష్యాలు, విధా న దృక్పథం, సంస్థాగత నిర్మాణం అవసరం. బీసీ ఉద్యమం కేవలం ఎన్నికల స మయంలో వినిపించే రాజకీయ నినాదంగా కాకుండా... సామాజిక న్యాయం, రాజ్యాంగ సమానత్వం, విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై సమగ్ర ఆలోచనా ఉద్యమంగా ఎదగాలి. సిద్ధాంత భావజాలం అంటే ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా నిలబెట్టడం కాదు.
సమాజంలోని అసమానతలను అ ధ్యయనం చేసి, చారిత్రక అనుభవాలను అర్థం చేసుకుని, రాజ్యాంగబద్ధమైన మా ర్గాల్లో సమాన అవకాశాల కోసం దిశానిర్దేశం చేయాలి. బీసీ ఉద్యమం ఈ విస్తృత దృక్పథాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. నినాదం ఉద్యమాన్ని ప్రారంభించవచ్చు.. కానీ సిద్ధాంతం, అధ్యయనం, సం స్థాగత క్రమశిక్షణ మాత్రమే దాన్ని దీర్ఘకా లం ముందుకు నడిపించగలవు.
సామాజిక ఐక్యతే ముఖ్యం
ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే హ క్కు ఉంది. బీసీ సమాజంలో భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉండటం సహజం. అయితే వ్యక్తిగత రాజకీయ అనుబంధాలకు అతీతంగా సామాజిక హక్కుల అంశా లపై కలిసి పనిచేయగల సామర్థ్యం ఉద్యమానికి అవసరం. ఒక పార్టీకి మద్దతు ఇచ్చే వ్యక్తి కూడా బీసీ హక్కుల కోసం ప్ర శ్నించవచ్చు. ఇతర రాజకీయ అభిప్రాయా లు కలిగినవారికీ ఉద్యమంలో సమాన స్థా నం ఉండాలి. ఐక్యత అంటే అందరూ ఒకే పార్టీకి లేదా ఒకే నాయకుడికి మద్దతు ఇ వ్వడం కాదు.
భిన్నాభిప్రాయాల మధ్య కూడా అంగీకరించిన సామాజిక సమస్యలపై కలిసి పనిచేయడం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలను ప్రశ్నించే స్వతంత్రతను బీసీ ఉద్య మం కాపాడుకోవాలి. పార్టీ రాజకీయాల కంటే ప్రజా విధానాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
కలాలు, గళాలు కలవాలి..!
బీసీ కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, పరిశోధకులు, మేధావు లు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉంది. బీసీ సమాజంలోని వివిధ కులాలు, వృత్తులు, సంస్కృతులు, భాషలు, జీవన అనుభవాలు, చారిత్రక పాత్రలను సాహి త్యం ద్వారా నమోదు చేయాలి. చరిత్రలో తగిన గుర్తింపు పొందని గొంతులను వెలుగులోకి తీసుకురావడం సాహిత్య బాధ్య తగా మారాలి. ఈ నేపథ్యంలో ‘బీసీ సాహి త్య ప్రకటన’ రూపొందించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలి.
అందులో సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, మహిళల భాగస్వామ్యం, యువత భవిష్యత్తు, వృత్తి సమూహాల సమస్యలు, రాజ్యాంగ హక్కులకు స్థానం కల్పించాలి. ఈ ప్రకటన ఒక వ్యక్తి లేదా సంస్థ అభిప్రాయంగా కాకుండా... విస్తృత సంప్రదింపులు, పరిశోధన, భిన్నాభిప్రాయాల గౌరవం, సామాజిక అనుభవాల ఆ ధారంగా రూపొందాలి.
అధ్యయనం అవసరం
బీసీలు రాజకీయంగా ఎందుకు వెనుకబడుతున్నారు? అనే ప్రశ్నకు ఒకే కారణా న్ని చూపడం సరైనది కాదు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ఖర్చులు, పార్టీల అంతర్గత అవకాశాలు, సామాజిక ప్రభావం, విద్య, ఆర్థిక వనరులు, నాయకత్వ శిక్షణ, మహిళల ప్రాతినిధ్యం వంటి అనేక అంశాలను పరిశీలించాలి. ప్రతి ఎన్నిక, ప్రతి నియోజకవర్గం, ప్రతి స్థానిక సంస్థ పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు.
అందువల్ల బీసీ రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి గణాంకాలను సేకరించి అధ్యయనం చేయాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్యతో పాటు పార్టీ పదవులు, నిర్ణయాత్మక కమిటీలు, విధాన రూపకల్పనలో భాగస్వామ్యాన్ని కూడా పరిశీలించాలి. జనాభా ప్రాతినిధ్యం.. ఎన్నికల ప్రాతినిధ్యం.. నిర్ణయాధి కారంలో భాగస్వామ్యం.. ఈ మూడు అం శాల మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
రాజకీయ నినాదాలను దాటి..!
బీసీ ఉద్యమం కేవలం ఎన్నికల సమయంలో టికెట్లు, పదవులు, రాజకీయ హామీల చుట్టూ తిరగకూడదు. విద్యార్థుల విద్యా అవకాశాలు, నిరుద్యోగ యువత సమస్యలు, వృత్తి ఆధారిత కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, మహిళల సాధికారత, చిన్న వ్యాపారాల అభివృద్ధి వంటి అంశాలపై నిరంతర కార్యాచరణ అవసరం. సా మాజిక ఉద్యమం బలపడాలంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థా గత నిర్మాణం ఉండాలి. ప్రతి ప్రాంతంలోని సమస్యలను నమోదు చేసి, సంబం ధిత శాఖల ముందు ఆధారాలతో ఉంచా లి.
ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, పథకాల అమలు, లబ్ధిదారుల ప్రాప్తి, విద్యా సంస్థల్లో అవకాశాలను నిరంతరం పరిశీలించాలి. రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాటం అవసరమే. అయితే రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు సామాజిక చైతన్యం, ఆర్థిక స్వావలంబన, విద్యా అభివృద్ధి, సాంస్కృతిక ఆత్మగౌరవం కూడా ఉద్యమ లక్ష్యాలుగా ఉండాలి.
యువత, మహిళల భాగస్వామ్యం
బీసీ ఉద్యమ భవిష్యత్తులో యువత, విద్యార్థులు, మహిళలు, వృత్తి నిపుణుల భాగస్వామ్యం కీలకంగా ఉండాలి. వారికి రాజ్యాంగం, చట్టాలు, ప్రజా విధానాలు, సామాజిక చరిత్ర, పరిశోధన పద్ధతులపై అవగాహన కల్పించాలి.
యువత కేవలం నినాదాలను పునరావృతం చేయకుండా ప్రశ్నించే స్వభావా న్ని పెంపొందించుకోవాలి. గ ణాంకాలను పరిశీలించాలి. ప్రభుత్వ పథకాల అమలును అధ్యయనం చేయాలి. త మ ప్రాంత సమస్యలను నమోదు చేసి, చట్టపరమైన, ప్రజాస్వామ్య మార్గాల్లో పరిష్కారాలను అన్వేషించాలి.
మహిళలకు ఉద్యమ సంస్థల్లో నిర్ణయాధికార అవకాశాలు కల్పించాలి. నా యకత్వ నిర్మాణంలో కొత్త తరానికి స్థానం ఇవ్వాలి. వ్యక్తి ఆరాధనకు బదులు సామూహిక నాయకత్వం, పారదర్శక నిర్ణయ ప్రక్రియ, బాధ్యతాయుతమైన సంస్థాగత సంస్కృతిని పెంపొందించాలి.
బీసీ ఉద్యమం వ్యక్తుల చుట్టూ మాత్రమే తిరిగితే దాని ప్రయాణం పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఉద్యమానికి దీర్ఘకాలిక బలం రావాలంటే స్పష్టమైన లక్ష్యాలు, ప్రజాస్వామ్య నిర్ణయ ప్రక్రియ, ఆర్థిక పారదర్శకత, సభ్యుల భాగస్వామ్యం, భిన్నాభిప్రాయాలకు గౌరవం అవసరం.
సంస్థలు పరస్పరం పోటీ పడటం కంటే ప్రజా సమస్యలపై సమన్వయంతో పనిచేయాలి.
భావజాలం నుంచి కార్యాచరణకు..
బీసీ ఉద్యమానికి సిద్ధాంత భావజాలం నిర్మించాలంటే మొదట ప్రజా సమస్యలపై ఆధారాలతో కూడిన పరిశోధన జరగాలి. విద్య, ఉపాధి, ఆదాయం, వృత్తులు, ఆస్తు లు, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ పథకాల ప్రాప్తిపై సమాచారాన్ని సేకరించాలి. ఈ సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో అందించాలి. రెండో దశలో రా జ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు, చట్టపరమైన అవకాశాలు, ప్రభుత్వ విధానాలపై ప్రజా అవగాహన పెంచాలి.
మూడో దశ లో కవులు, రచయితలు, కళాకారులు, పరిశోధకులు, యువత, మహిళల భాగస్వా మ్యంతో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వేదికలను నిర్మించాలి. చివరగా ప్రజా సమస్యలపై స్పష్టమైన విధాన ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వాలు, రాజకీ య పార్టీలు, ప్రజా సంస్థల ముందు ఉం చాలి. డిమాండ్‌తోపాటు దాని వెనుక ఉ న్న గణాంకాలు, చట్టపరమైన ఆధారాలు, అమలు మార్గాలను కూడా వివరించాలి.
కొత్త ఆలోచనా దశ అవసరం
బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అవకాశాలు, విద్య, ఉపాధి వంటి అంశాలు ఒక ఎన్నికతో ము గిసే సమస్యలు కాదు. ఇవి చరిత్ర, రాజ్యాం గం, గణాంకాలు, విధానాలు, ప్రజా భాగస్వామ్యంతో నిరంతరం చర్చించాల్సిన అం శాలు. బీసీ ఉద్యమం నినాదాల స్థాయిని దాటి పరిశోధన, సాహిత్యం, సంస్కృతి, చట్టపరమైన అవగాహన, విద్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, రాజకీయ భాగస్వామ్యంతో కూడిన సమగ్ర ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి.
గ్రామీణ ప్రజల నుంచి మేధావుల వరకు ప్రతి వర్గం ఈ ఆలోచనా ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి. నుంచి నిర్ణయాధికారం వ రకు.. రాజకీయ నినాదాలను దాటి సామాజిక, సంస్కృతిక, సాహిత్య, వైజ్ఞానిక ఉద్యమం గా బీసీ ఉద్యమ నిర్మా ణం ఎదగాలి!!
వ్యాసకర్త: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు 9959912341