19 August, 2026 | 1:49 AM

పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్

19-08-2026 12:20 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : బహుజన నాయకుడు, పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్  కోరారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతిని పురస్కరించుకుని  పసుపులేరు ఒడ్డున రేణుక ఎల్లమ్మ ఆ లయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ , బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి గంగా కిషన్, ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ , నరసింహారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.