సినిమా చూసి భక్తిభావంతో వెళ్తారు!

10-09-2026 | 05:35am

సుమంత్(Sumanth), ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్(Devotional action thriller) ‘మహేంద్రగిరి వారాహి’. సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి(Santosh Jagarlapudi) దర్శకత్వం వహించారు. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మధు కలిపు విలేకరులతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. “-దర్శకుడు చెప్పిన వారాహి అమ్మవారి కథ బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ ప్రారంభించాం.

ఇది అద్భుతమైన కథ. పైగా మా బ్యానర్ పేరు ‘రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్’ కావడం, అదీ అమ్మవారి పేరే కావడం.. సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పర్ఫెక్ట్ మల్టీస్టారర్ ఇది. సుమంత్ నటన అద్భుతంగా ఉంటుంది. ఐశ్వర్య రాజేశ్ అమ్మవారి రూపంలో చాలా అద్భుతంగా కనిపిస్తారు. సిద్దు పాత్ర సినిమాపై చాలా ప్రభావంతంగా మారింది.

మేము ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో గొప్పగా తీశాం. దాదాపు గంట పాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుంది. -ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా గొప్ప భక్తిభావంతో అమ్మవారికి నమస్కరించి థియేటర్ నుంచి బయటకు వస్తారు. నా తర్వాతి ప్రాజెక్టులు.. -దర్శకుడు సంతోష్‌తో మరో సినిమా చేసే ఆలోచన ఉంది. ఒక హాలీవుడ్ స్టూడియోతో కలిసి నేరుగా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో హారర్ మూవీ చేస్తున్నాం”. 

మరిన్ని వార్తలు