కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
18-09-2026 | 06:34am
శంకరపట్నం: కరీంనగర్ జిల్లాలో(Karimnagar) శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై(Karimnagar-Warangal National Highway) శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఆగిఉన్న లారీని డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాద మృతులను నిజామాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని నిజామాబాద్ కు చెందిన ట్రాన్స్ కో ఉద్యోగులుగా(Transco employees) గుర్తించారు. మృతులను పర్శి, సుధాకర్, విశ్వేశ్వర్ గా నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్త మార్చురీకి తరలించారు.