వీధి కుక్కలతో మున్సిపల్‌కు

18-09-2026 | 05:15am
  1. టేబుల్‌పై శునకాలను ఉంచి యువసేన వినూత్న నిరసన
  2. పీక్కుతింటున్నా పట్టించుకోరా అని నిలదీత

ముంబై, సెప్టెంబర్ 17:మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్ జిల్లాలో వీధికుక్కల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవ డంతో యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రంథావా(Yuva Sena District President Vikram Randhawa), కార్యకర్తలు విసుగుచెందారు. నిఫాడ్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భమ్రే కార్యాలయంలో సంచులలో వీధికుక్కలతో గురువారం వెళ్లి టేబుల్‌పై వాటిని వదిలి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యతో అధికారి ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వైపు వీధి కుక్కల బెడద ఎక్కువై కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారని, బాధితుల్లో చిన్నా, పెద్ద తేడా ఉండడం లేదని విక్రమ్‌రంథావా వాపోయారు. అధికార యంత్రాంగానికి ఈ విషయంపై అనేకసార్లు ఫిర్యాదులు కూడా చేశామన్నారు. అయినా వీరిలో చలనం లేదన్నారు. అందుకే ఈ వినూత్న నిరసనకు దిగామని చెప్పారు. వీధి కుక్కలను అధికారి ముందు బల్లపై కూర్చోబెట్టారు. మరికొందరు యువసేన సభ్యులు కరెన్సీనోట్ల దండను కూడా తీసుకువచ్చి నిరసన వ్యక్తంచేశారు.

కుక్కల సంఖ్యను వెంటనే నియంత్రించాలని, వాటిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోగా సమస్య పరిష్కారం కాకపోతే, మహిళలతో పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వచ్చి నిరసన తెలియజేస్తామని విక్రమ్ రంథావా హెచ్చరించారు. కాగా అధికారి ధీరజ్ మాట్లాడుతూ.. వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే రెండుసార్లు టెండర్లను జారీ చేశామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించాలని కోరారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ.. ప్రతీనెలా వందకుపైగా కుక్కకాటు కేసులు వస్తున్నాయని తెలిపాడు. 

మరిన్ని వార్తలు