టమోటా ధర ధమాల్..

18-09-2026 | 05:25am
  1. 25 కేజీల క్యారెట్ 400 రూపాయలు 

అమ్ముకోలేక అవస్థ పడుతున్న రైతులు 

నిర్మల్ సెప్టెంబర్ 17 ( విజయ క్రాంతి): వంటింటి కూరగాయల్లో(Vegetables) టమాటా (Tomato)ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. ఏ కూర వండిన రెండు టమాటాలు వేస్తే గాని కూరకు రుచి ఉండదు. అటువంటి టమాటా పంటను పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. 15 రోజుల క్రితం వరకు కేజీ టమోటా 20 రూపాయలు ఉండగా ఒక్కసారిగా టమాటా ధర కేజీకి 10 నుంచి  రూపాయలు ధర హోల్ సేల్ గా వస్తుందని టమాటా రైతులు ఆవేదన చెందుతున్నారు.

జూన్ జూలై మాసంలో జిల్లాలోని నిర్మల్ సారంగాపూర్ లక్ష్మి దిల్వార్పూర్ బైంసా సోన్ మామడ కుబీర్ తదితర మండలాల్లో చాలామంది రైతులు టమాటా పంటలు సాగు చేస్తున్నారు. టమోటా మంచి రకాన్ని పెంచుకొని పంటచేర్లో సాగు చేసి పంట సాగు కోసం పురుగుల మందులు సస్యరక్షణ చర్యలు ఎరువులు వేసి టమాట కుళ్ళిపోకుండా దారాలు కట్టి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పంట దిగుబడులపై ఆశలు పెంచుకున్నారు. 

ధర డమాల్ 

నిర్మల్ జిల్లా తో పాటు, అదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్, ఉట్నూర్  నార్నూర్ నార్నూర్, అదిలాబాద్ తదితర ప్రాంతాల్లో రైతులు వానకాల సీజన్లో టమాటా పంటను సాగు చేస్తారు. ఈ పంట 70 రోజుల్లో చేతికి వస్తుంది. టమాటాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్న ఆశతో రైతులు పంటలు సాగు చేస్తే ఈసారి ధర ఒక్కసారిగా పడిపోయింది. నెల రోజుల క్రితం 20 కేజీల క్యారెట్ టమాటా 800 ఉండగా ప్రస్తుతం అది 40 రూపాయలకు పడిపోయినట్టు రైతులు చెప్తున్నారు.

పంట పెట్టుబడి మందులు శాస్త్ర రక్షణ చర్యలు కూలీలు ఎకరానికి 20వేల వరకు ఖర్చు అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టమాట దిగుమతి కావడంతో ఒక్కసారిగా పడిపోయింది. అసలు హోల్సేల్ రూపంలోనే ధర పడిపోవడంతో పొట్టేలు వ్యాపారులకు మరింత కష్టంగా మారింది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఈ ప్రాంతంలో టమాటాను సంరక్షించునందుకు కోల్ స్టోరేజ్ గోదాములు అందుబాటులో లేకపోవడం పండిన టమాట పంట మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండే అవకాశం లేదంటున్నారు. దీంతో టమాటా కుళ్ళిపోయి పంటకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో రైతులు పంటలు వెంట వెంటనే కూలీల సాయంతో తెంపి మార్కెట్ తీసుకొస్తున్నారు. నిర్మల్, భైంసా మార్కెట్ కు టమాటా రైతులు రాగా డిమాండ్ కంటే ఎక్కువగా ఉండటంతో హోల్సేల్ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు.

దీంతో రైతులు గత్యంతరం లేక దళారులు చెప్పిన ధరకు విక్రయించి నష్టపోతున్నారు. మిగిలిపోయిన టమోటాలను రోడ్డుపై కోతులకు ఆహారంగా వేస్తున్నారు. గ్రామాల్లో ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి టమాటా పండిస్తే ప్రస్తుత సీజన్లో ధరలు రాకపోవడంతో తమకు పంట పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం తమ ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు