ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని వర్గాలు ఐక్యంగా పోరాడాలి
హనుమకొండ లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పిలుపు
మంథని, అక్టోబర్ 03 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య పరిరక్షణ(Protection of Democracy) కోసం అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ వారం లో భాగంగా హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ఇండియా కూటమి(INDIA Alliance) సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.