5 September, 2026 | 1:15 AM

శ్రీకృష్ణుని బోధనలు సమాజానికి ఆదర్శం

04-09-2026 | 11:23pm

మహాదేవపూర్‌లో జన్మాష్టమి వేడుకల్లో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, మహాదేవపూర్,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు(Krishna Janmashtami celebrations) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(Secretary Duddilla Srinu Babu) హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీను బాబు భక్తులకు, ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీను బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా ఉట్టి కొట్టి వేడుకల్లో మరింత సందడి, ఉత్సాహాన్ని నింపారు.

మరిన్ని వార్తలు