ఎమ్మెల్యేకు కార్మిక సంఘాల నాయకుల కృతజ్ఞతలు
కాగజ్ నగర్,(విజయ క్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల (Sirpur paper mill workers)సమస్యలను శాసనసభలో ప్రస్తావించిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(MLA Dr. Harish Babu)కు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ఎదుట రిలే దీక్షలో పాల్గొన్న కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మాట్లాడారు. ముఖ్యంగా 115 రోజులుగా పేపర్ మిల్లు లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిపించాలి.
డిమాండ్ చేస్తూ పేపర్ మిల్లు గేటు ఎదుట కార్మికులు రిలే దీక్షలు చేస్తున్నారు. ఎస్ పి ఎం పేపర్ మిల్లు లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేయడం అభినందనీయమని జేఏసీ కన్వీనర్ గోగర్ల రాములు, కుశన్న రాజన్న ,తదితరులు ఎమ్మెల్యే తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈనాటి దీక్షలో కార్మికులు ఏకే సింగ్, నాగరాజు, నీలి రాజన్న పాల్గొనగా సిపిఎం నాయకులు మంజం ఆనంద్ కుమార్, మొగిలి వెంకటేష్, అంబాల ఓదెలు తదితరులు సంఘీభావం తెలిపారు.