ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ పోస్టర్ ఆవిష్కరణ

02-10-2026 | 07:17pm

హనుమకొండ, అక్టోబరు 2 (విజయ క్రాంతి): క్రెడాయ్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ట్రై సిటీస్ హాఫ్ మారథాన్–2026,(Tri-Cities Half Marathon Poster) ఎడిషన్–2” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 17 న హనుమకొండ లోని కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్స్ నుంచి మారథాన్ ప్రారంభం కానుందని,ఇందులో 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్,ఉదయం 5.30కి, 10 కిలోమీటర్లు ఉదయం 6.15కి, 5 కిలోమీటర్ల రన్ 7.30 కి ఫన్ రన్ పేరిట నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ పై అవగాహన పెంపొందించడం తో పాటు వరంగల్ ట్రై సిటీస్‌ లో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మారథాన్‌ ను నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఆఫ్ మారథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, కోశాధికారి బోళ్ళ అమర్, కంకణాల సంతోష్, వల్లాల వెంకటరమణ,ఇరుస వడ్ల బాలాజీ, సందీప్ రెడ్డి, బోడ జీవన్,రోషన్,బండి శ్రీరామ్ తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు