రెండు బైకులు ఢీ, భార్యాభర్తలు మృతి

23-09-2026 | 11:23pm

కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) రామారెడ్డి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొనడంతో రామారెడ్డి మండలం మద్దికుంట చెందిన దుంపల బాలమణి(38), దుంపల రాజయ్య(45) భార్యాభర్తలు మృతిచెందారు. మద్దికుంటకు చెందిన దుంపల రాజయ్య, బాలమణి, కామారెడ్డి నుంచి మద్దికుంటకు వస్తుండగా రామా రెడ్డి లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. రామారెడ్డి చెందిన మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు