5 September, 2026 | 4:31 PM

జనగామలో వాటర్ ట్యాంక్ ఎక్కిన ఇద్దరు వ్యక్తులు

05-09-2026 | 02:37pm

జనగామ, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): దేవరుప్పుల మండలం కడవెండి(Kadavendi) గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జనగామ జిల్లా కలెక్టరేట్ లో జరగాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లక్కీ డ్రాను ఆపాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కలెక్టరేట్(Collectorate)లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా(Lucky Draw) నిర్వహిస్తున్న సమయంలోనే వారు ట్యాంక్ ఎక్కడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తమకు అన్యాయం జరుగుతోందని, అర్హులైన తమ పేర్లను పక్కన పెట్టి లక్కీ డ్రా నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లక్కీ డ్రాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు

మరిన్ని వార్తలు