ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు

21-09-2026 | 08:26pm

నిజామాబాద్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి) : నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో(Municipal Office) మరో ఇద్దరు అధికారులు ఏసీబీ వలలో  చిక్కారు. తోటి ఉద్యోగి పదవి విరమణ పొందిన తరువాత పొందాల్సిన ఫించన్, ఇతర అలవెన్స్ ల ఫైల్ క్లియర్ చేయడానికి 15 వేలు లంచం డిమాండ్ చేస్తూ  అకౌంట్స్‌ సెక్షన్‌లో జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అశోక్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కిరణ్ రూ.15 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

తోటి ఉద్యోగి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసి గత ఐదు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.

తాను అంత మొత్తం చెల్లించుకోలేనని వేసుకున్నా వారు వినకపోవడంతో ఏసీబీని ఆశ్రయించింది. లంచం డిమాండ్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు 15 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు నిజామాబాద్ ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు