తెలంగాణలో నిరంకుశత్వం నడ్వదు
- అన్యాయాన్ని ఎదిరించడం ఈ నేల స్వభావం
- కొత్తగా 2.25 లక్షల పింఛన్లు
- సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
- త్వరలో వరంగల్ దవాఖాన ప్రారంభం
- 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్17 (విజయక్రాంతి): అణచివేతలు, పెత్తందారీ విధానాలను ధిక్కరించిన నేల తెలంగాణ (Telangana) అని.. యోధులకు ఇది పుట్టినిల్లు అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గుర్తుచేసు కున్నారు. నిరంకుశత్వాన్ని ఇక్కడి ప్రజలు ఏమాత్రం సహించబోరని తేల్చిచెప్పారు. తెలంగాణ సుదీర్ఘ పోరా ట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని ఆయన తెలిపారు. ‘సెప్టెంబర్ 17’ను రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన దినోత్సవం’గా నిర్వహిం చింది. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. అన్యాయాన్ని ఎదిరించడం తెలంగాణ స్వభావమన్నారు. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని.. రావి నా రాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ వంటి ఎందరో యోధులు పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు.
ప్రపంచంతోనే పోటీ..
ఆపరేషన్ పోలో అనంతరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకుందని గుర్తుచేశారు. నిజాం నవాబ్‌తో హైదరాబాద్‌కు ప్ర పంచస్థాయి గుర్తింపు దక్కిందన్నారు. తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతున్నదన్నారు.
రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం అని తెలిపారు. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే తమ లక్ష్యమన్నారు. “ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం.. వారి సమస్యలకు పరిష్కారం చూపడం.. వారి హక్కులను కాపాడడం.. ప్రభుత్వ వనరులు అందరికీ చే రేలా చూడడం. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ముందుకు సాగుతున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
“రైతులకు రూ.2 లక్షల పంట రుణా లు మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేశాం. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రై తుల ఖాతాల్లో జమ చేశాం. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నాం. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షే మానికి దాదాపు రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు చేశాం.
భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చాం. భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించాం. 5 లక్షల 94 వేల మంది రైతులకు పట్టాదార్ పాస్‌బుక్‌లు జారీ చేశాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు ద క్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం చే స్తున్నాం. పాలమూరు సీతారామ ఎత్తిపోతలు, ఎస్‌ఎల్‌బీసీతోపాటు పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
కోటీశ్వరులుగా మహిళలు..
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం రేవంత్ తెలిపారు. “ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంతో ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అ యింది. గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అం దించాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వా రా 1. 68 లక్ష మంది రూ. 4,709 కోట్ల స హాయం చేశాం. 4.54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాం కు లింకేజీ, రూ. 1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించాం. మహిళా మార్ట్లు, పెట్రోల్ బంకు లు, ఆర్టీసీ అద్దె బస్సులతో మహిళల ఆదా యం పెంచుతున్నాం. 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం’ అని చెప్పారు.
కొత్తగా పింఛన్లు..
రాష్ట్రంలో 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 31 వేల కోట్లు అందించామని సీఎం రేవంత్ తెలిపారు. తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛ న్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు అందిం చామని చెప్పారు. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించామని వివరించారు.
త్వరలో వరంగల్ దవాఖాన షురూ
సామాజిక అంతరాలను తగ్గించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో సా మాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్త్రీయంగా చేపట్టామని సీఎం రేవంత్ తెలిపారు. ఆ సర్వే గణాంకాల ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించామన్నారు. దేశంలోనే తొలి సారిగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణలోనే చేపట్టుకున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కండ్ల లాంటివని ఆయ న వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, ప్రతి నియో జకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, అమెరికాకు చెందిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీతో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యా సంస్థల సమాఖ్య యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు.
సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం మొదలైందని తెలిపారు. అ ల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. వరంగల్‌లో 2 వేల పడకలతో టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ని యామకాలతో పాటు గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహిం చామని సీఎంరేవంత్ తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించామన్నారు.
55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తామనిచెప్పారు. ఆహారకల్తీని అరి కట్టేం దుకు టీజీసేఫ్ ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ వ్యవస్థను పటిష్ఠం చేశామన్నారు.
30 వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ..
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నా రు. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూ చర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నామని వివరించారు. డిసెంబర్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని వెల్లడించారు.
ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకు వచ్చిందన్నారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అమె జాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టిందని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్- హైదరాబాద్- హైదరాబాద్- విజయవాడ పారి శ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయని సీఎం పేర్కొన్నారు.
గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు పనులు చేపట్టామని.. ఆర్ అండ్ బీ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్ పరిధిలో రూ.6,294 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నామని వివరించారు. తాగునీరు, విద్యుత్ సర ఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తున్నామన్నారు. వీబీ జీ రామ్ జీలో ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.