కొండపాక కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కొండపాక, సెప్టెంబర్: 6( విజయ క్రాంతి): కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండపాక గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా జంజారపు నర్సింలు, గౌరవ అధ్యక్షుడిగా పంబాల సురేందర్, ఉపాధ్యక్షుడిగా రేపాక రాజు, ప్రధాన కార్యదర్శిగా నల్ల మల్లేశం, కార్యదర్శిగా దొమ్మాట సందీప్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా బర్రె మురళి, కోశాధికారిగా కాశమైన నర్సింలు, ప్రచార కార్యదర్శిగా తుప్పుడు సురేష్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జంజారపు నర్సింలు మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు






