యూపీఐ ఛార్జీల రచ్చ
నిత్యావసరంగా మారిన యూపీఐకి ఛార్జీలు (Charges for UPI) జోడించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే అక్టోబర్ 15 నుంచి 2 వేల కంటే ఎక్కువ విలువైన కొన్ని వ్యాపార యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (Merchant discount rate) (ఎండీఆర్) అమల్లోకి రానుండటంపై చర్చకు దారితీసింది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 మాత్రమే వసూలు చేస్తారు. ఈ వసూళ్లు ఎన్ని దొంతరలైనా వినియోగదారుడు బేఫికర్‌గా ఉండవచ్చునని కేంద్ర ప్రభుత్వం భరోసానిస్తున్నది. దీనితో అనుదినం చిన్న మొత్తాల్లో యూపీఐ వినియోగించే కోట్లాది మందికి ఇది ఊరటే అయినా వ్యాపారులు ఛార్జీల విధానంపై ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్థకం.
చెల్లించడమేమిటని ఇప్పటికే వ్యాపారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు నిరసన గళం వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతామనీ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. 2 వేలకు పైగా యూపీఐ చె ల్లింపులపై ఎండీఆర్ విధిస్తే, ఆన్‌లైన్ చెల్లింపులు తీసుకోమని పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఖరాకండిగా చెబుతున్నారు. ఎండీఆర్ భారం తమ లాభాలకు చిల్లు పెడుతుందనేది వారి ఆందోళన. క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఇప్పటికే 1 శాతం వరకు ఎండీఆర్ భరిస్తున్నప్పుడు, కొత్తగా ఈ బాదు డేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అటు తిరిగి ఇటు తిరిగి యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై పడొచ్చని అంటున్నారు. వ్యాపారాల్లో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా ఉండాలం టే వినియోగదారుల నుంచి నగదు చెల్లింపులు అడిగేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పటికే విస్తృత వినియోగంలోకి వచ్చిన డిజిటల్ చెల్లింపుల విధానం, వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. యూపీఐ చెల్లింపుల విధానంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యాప్ సంస్థలకు ఖర్చులు తగ్గించాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతున్నా .
ఈ మార్పు ఎటువైపు దారితీస్తుందోనన్నది వినియోగదారుల ఆందోళన. అమల్లోకి తీసుకురావడంపై పార్లమెంట్ స్థాయీ సంఘం సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు కూడా మద్దతు తెలిపారని బీజేపీ ప్రకటించ డంపైదుమారం చెలరేగింది. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ మార్గం ఎంచుకున్నదని కాంగ్రెస్ అసలు ఈఛార్జీలు అమెరికా కంపెనీల జేబులు నింపడానికేనని రాహుల్‌గాంధీ విమర్శిస్తున్నారు. విమర్శలను కేంద్రం మొత్తంగా యూపీఐ ఛార్జీల అంశం అక్టోబర్ 15 తర్వాత ఏవైపు వెళుతుందో చూడాలి.