దమ్మపేటలో గ్రామసభ

02-10-2026 | 09:13pm

దమ్మపేట, అక్టోబర్ 02 (విజయ క్రాంతి): వీబీ-జీ రామ్ జీ పథకంపై(VB-G Ram Ji Scheme) నిర్వహించే గ్రామ సభను శుక్రవారం దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, కార్యదర్శి కొల్లు దుర్గారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన "వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ చట్టం అమలు, ప్రణాళికల రూపకల్పన  ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

కొత్త వీబీ-జీ రామ్ జీ చట్టానికి ఉన్న మార్పులను, వేతనదారులకు ఇచ్చేవి, పని దినాల పెంపు, పనుల గుర్తింపు, గ్రామ పంచాయతీ పరిధిలో ఏ పనులు చేపట్టాలి, కొత్తగా పనులకు వచ్చే కుటుంబాలను గుర్తించి, వారికి గ్రామీణ రోజ్‌ గార్ గ్యారెంటీ కార్డులను మంజూరు చేసే ప్రక్రియను, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, కాలువల మరమ్మతులు, చెరువుల పునరుద్ధరణ, పంటల నిల్వ కోసం గిడ్డంగులు, ఎండ పెట్టే ప్లాట్‌ ఫారాలు, రోడ్ల నిర్మాణం తదితర దాదాపు 318 నుండి 375 రకాల పనులు ఉన్నాయని కార్యదర్శి కొల్లు దుర్గారావు, ఫీల్డ్ అసిస్టెంట్ గొల్లపల్లి వెంకటేష్ సభలో పాల్గొన్న ప్రజలకు తెలియజేశారు.

గ్రామస్తులు దమ్మపేట మండల కేంద్రంలో గల సువిశాల బస్టాండ్ ప్రాంగణంతో కూడిన బస్టాండ్ కావాలని పంచాయతీ పర్మిషన్ లేకుండా గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా పోలీసులను పెట్టి దౌర్జన్యంగా కట్టిన పెట్రోల్ బంకును వెంటనే కోర్ట్ ఆదేశాల మేరకు నిర్మాణాలను కూల్చాలని, పంచాయతీ పాలక వర్గం వెంటనే తీర్మానం చేసి సంబంధిత అధికారులకు నోటీసులు ఇవ్వాలని,

రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 100కు పైగా బస్ సర్వీసులు దమ్మపేట గుండా ప్రయాణిస్తాయని భవిష్యత్తు తరాలు బస్ ఎక్కే పరిస్థితి లేక నడి రోడ్డు పై కనిపించి కనిపించని సందులో ఉన్న బస్టాండ్ లో మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుందని, ఫిర్యాదులు వచ్చినప్పుడు, నామ మాత్రంగా బస్టాండ్ లోకి ఒకటి రెండు బస్సులు బస్టాండ్ లోకి వెళ్ళాయి అని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

తదనంతరం ఈ సమస్యపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నశెట్టి యుగంధర్ మాట్లాడుతూ దమ్మపేట బస్టాండ్ అభివృద్ధికి నిధులు కావాలంటే దాదాపు 90 లక్షల రూపాయల నిధులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమకూర్చినట్లు తెలిపారు. అప్పికుంట చెరువు నుండి వచ్చే వరద మోడల్ కాలనీ, గాయత్రి నగర్, అర్బన్ కాలనీ జంక్షన్ వద్ద రోడ్లను ముంచ కుండా కాలవ ను తీసి రాంజీకుంట ద్వారా కోమలచెరువు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని గట్ల నాగరాజు కోరారు. 

ఈ గ్రామ సభలో వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, రూపా రాంబాబు, గోళ్ళ భవాని కృష్ణ యాదవ్, చిన్నశెట్టి చిట్టిబాబు, పసుమర్తి మురళి, ఎస్ కె రహీం, యార్లగడ్డ ఈశ్వరరావు, నల్లగట్ల సత్యంబాబు, అంగన్వాడి టీచర్లు, ఆశాలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు