గల్ఫ్ ఏజెంట్ ఇంటిముందు బాధిత కుటుంబాల బైఠాయింపు

19-09-2026 | 03:02pm
  1. పనిచేసిన కాలానికి జీతాలు ఇవ్వాలని బైఠాయింపు 
  2. సొంత కంపెనీలో పని చేయించుకుని జీతాలు ఇవ్వడం లేదని బాధితుల ఆరోపణ.

కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సర్పరాజుపూర్ (Sarparajupur) గ్రామంలో గల్ఫ్ ఏజెంట్ (Gulf Agent)ఇంటిముందు కొంతమంది బాధితులు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. బాధితుల వాదన ప్రకారం..  సర్పరాజుపూర్ గ్రామానికి  చెందిన సిమల్ల మధు గల్ఫ్‌లోని తన కంపెనీలో ఉద్యోగాల కోసం తమను పంపించారని, అక్కడ పనిచేసిన అనంతరం తమకు రావాల్సిన జీతాలు తదితర చెల్లింపుల్లో జాప్యం జరిగిందని తెలిపారు.

దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. చెల్లింపుల విషయమై సంబంధిత వ్యక్తులను పలుమార్లు సంప్రదించినట్లు బాధితులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు, ఇతర వ్యక్తులను కూడా కలిసినప్పటికీ తమకు రావాల్సిన మొత్తాలు పూర్తిగా అందలేదని వారు పేర్కొన్నారు. ఈ విషయాలపై తమకు స్పష్టత ఇవ్వడంతో పాటు, రావాల్సిన బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమ సమస్యను పరిష్కరించి, బకాయి జీతాలు, ఇతర చెల్లింపులు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తూ ఏజెంట్ ఇంటిముందు బైఠాయించినట్లు బాధితులు తెలిపారు. ఏజెంట్ ను ఫోన్ లో సంప్రదించగా తాను హైదరాబాద్ లో ఉన్నానని  

రేపు ఉదయం వచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పడంతో బాధితులు తిరిగి వెళ్లిపోయారు. బాధితుల్లో  నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు మరియు సొంత గ్రామానికి చెందినవారు కూడా ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు