గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం
21-09-2026 | 05:11pm
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని రామాపురం గ్రామంలో వినాయక చవితి(Vinayaka Chavithi) అన్నప్రసాద వితరణ మహోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడవ వార్డు కౌన్సిలర్ వాస జ్యోతి శేఖర్ హాజరై మాట్లాడుతూ, ఆ గణేష్ నీ యొక్క దీవెనలు మన ఊరి పై ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకు న్నానన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శివనేని విజయ్,బైరవ, ఏసు,చందమల్ల అనిల్, సాధనాల, సమై, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.