సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ ఎంట్రీకి రెడీ
08-09-2026 | 11:49am
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’(Viswanath & Sons) మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ‘నెటిక్స్’ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో సినిమా మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.