డిసెంబర్‌లోనే వృషకర్మ

11-09-2026 | 05:30am

టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య, డైరెక్టర్ కార్తీక్ దండు కాంబోలో వస్తున్న మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్ట్రైకింగ్ గ్లింప్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా గురువారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేటర్లలో అడుగుపెట్టనున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బీ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: రాగుల్ డీ హెరియన్; ప్రొడక్షన్ డిజైన్: శ్రీ నాగేంద్ర తంగాల; ఎడిటర్: నవీన్ నూలి. 

మరిన్ని వార్తలు