వరంగల్ ఎయిర్‌పోర్టు కల సాకారం చేస్తాం:సీఎం

19-09-2026 | 04:54pm

వరంగల్: వరంగల్‌ విమానాశ్రయ కల త్వరలో సాకారం కాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి(CM) అన్నారు. విమానాశ్రయానికి పేరు సూచించాలని ప్రజలను కోరారు. ప్రజా ప్రభుత్వ కృషితో వరంగల్‌కు ఎయిర్‌పోర్టు(Airport for Warangal) తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరంగల్‌ ఎయిర్‌పోర్టుపై దృష్టి పెట్టలేదని సీఎం విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వ హయాంలో వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలను సాకారం చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు