విద్యార్థులకు నీటి సమస్య పరిస్కారం
21-09-2026 | 07:59pm
రాజాపూర్ సెప్టెంబర్ 21: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలోని (Tirmalapur Village)ప్రాథమిక పాఠశాలలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు మోటార్ ను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలలో ఏ సమస్యలున్న సత్వరమే పరిష్కరిస్తామని సర్పంచ్ తెలిపారు.
మంచినీటి కొరత పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు సర్పంచ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భరత్, ఉప సర్పంచ్ రామ్ చందర్,వార్డు మెంబర్లు రహిమత్ పాషా,శ్రీశైలం,చంద్రయ్య, శ్రీహరి,రవి తదితరులు పాల్గొన్నారు.