6 September, 2026 | 8:35 AM

కలిసి సినిమా చేయాలని మాకూ ఉంది, కానీ..

06-09-2026 | 05:30am

బ్లాక్ బస్టర్ ‘సర్దార్’కి సీక్వెల్‌గా రూపొందుతోంది ‘సర్దార్ 2’. కార్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి చెప్పిన ఈ సినిమా విశేషాలివీ.. 

* “ఇండియాలో స్పై సినిమాలు (Spy movies) చాలా తక్కువ. ఆ సినిమాలు తీయడం అంత ఈజీగా కూడా కాదు. మనకు స్పై అంటే టామ్ క్రూజ్ లాంటి హీరోలు గుర్తుకొస్తారు. రవీంద్ర కౌశిక్ (Ravindra Kaushik) అనే ఒక రంగస్థల నటుడు పాకిస్తాన్‌లో ఒక మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు. ఆ కథ మనందరికీ తెలుసు. అలాగే స్పై అధికారులు మనమధ్యే సాదాసీదాగా ఏం తెలియనట్లు ఉంటారు.  దర్శకుడు అలాంటి అంశాలన్నీ జోడిస్తూ కథ చెప్తున్నప్పుడు నాకు చాలా నచ్చింది.

* సర్దార్‌లో వాటర్ కాన్సెప్ట్ మీకు ఎలా ఇంపాక్ట్ చేసిందో.. దానికి పది రెట్లు ఇంపాక్ట్‌ఫుల్‌గా ‘సర్దార్ 2’ ఉంటుంది. 

* మనకు ఈ మధ్యకాలంలో స్పై యూనివర్స్‌లో ‘దురంధర్’ సినిమా వచ్చింది. కాకపోతే దాని కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు ‘సర్దార్ 2’లో కూడా కాన్సెప్ట్ పరంగా, విజు వల్ పరంగా చాలా హై స్టాండర్డ్‌లో, సౌత్‌లో కూడా ఇంత గొప్ప సినిమా చేయగలమని చెప్పేలా ఉంటుంది.

* ఇందులో ఫాదర్, సన్ క్యారెక్టర్స్ కలిసి ట్రావెల్ చేస్తారు. రెండు పాత్రలు ఒకేసారి చేయడం చాలా చాలెంజింగ్. అలాగే మేకప్ విషయం లో కూడా చాలా ఓపికతో చేశాం. -నాకు యాక్షన్ చాలా ఇష్టం. కానీ ఇం దులో ఒక ఛాలెంజ్ ఉంది. ఇందులో ఒక ఓల్డ్ మాన్‌లాగా ఫైట్ చేయాలి. ఓల్డ్ మాన్ చాలా స్కిల్‌గా ఉంటాడు. తను ఫైట్స్ ఏదైనా ఉపయోగించవచ్చు. అందులోనూ తను గూఢచారి కాబట్టి తన దగ్గర చాలా టెక్నిక్స్ ఉం టాయి. ఫైట్స్ చాలా ఎంజాయ్ చేశాను.

* ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీ పడలేదు. వందే భారత్ ట్రైన్ మొత్తం సెట్ వేశారు. ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ ఎవరూ చేయలేదు. ‘సర్దార్’ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే రిలీజ్ అయింది. ఇప్పుడు ‘సర్దార్ 2’ కూడా  ఆ సంస్థలోనే రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది.  

* సూర్య, నేను కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -మాకూ చేయాలనే ఉంది. కాకపోతే అలాంటి కథ, దర్శకుడు కుదరాలి. మేమూ అలాంటి కథ కోసం  చూస్తూ ఉన్నాం. 

మరిన్ని వార్తలు