17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

చేనేతకు మరింత చేయూతనివ్వాలి

26-01-2026 12:50 AM

పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సోషలైట్ అనన్య సిమ్లాయి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో గల లేబుల్స్ పాప్-అప్ స్పేస్‌లో ఏర్పాటైన డి సన్స్ పటోలా ఆరట్స్ వస్త్ర  ప్రదర్శన సోషలైట్ అనన్య సిమ్లాయి ప్రారంభించారు. ‘విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రో త్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వీవర్ నుంచి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని, చేనేత దుస్తులను ప్రతి ఒక్కరూ ధరించాలని అనన్య సిమ్లాయి అన్నారు.

డి సన్స్ పటోలా ఆరట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో  సాంప్రదాయ వస్త్రాలు, చేతితో తయా రు చేసిన ప్రత్యేక వస్త్రోత్పుల కలెక్షన్ వేదికగా పటాన్ పటోలా, బంధాని, బనారసి, పైథా ని, కాశ్మీరీ, కాంత శారి, టస్సర్ సిల్క్, ఆర్గా న్జా, లక్నోవి, అజ్రాక్ చీరలు, సూట్లు మరియు కుర్తీలు, డ్రెస్ మెటీరియల్, ఆభరణాలు, బెడ్షీట్లు వంటి  ఉత్పత్తులు అందుబా టులో ఉంటాయన్నారు.నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్  ప్రధాన సామాజిక లక్ష్యం అని తెలిపారు.