ఆరేళ్ల తర్వాత ఎన్డీఏలోకి అకాలీదళ్.. బీజేపీతో పొత్తు

24-11-2026 | 01:14pm

పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శిరోమణి అకాలీదళ్ (Shiromani Akali Dal) మరోసారి ఎన్డీఏ (NDA) కూటమిలో చేరింది. ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ (BJP)తో మళ్లీ చేతులు కలిపింది. అకాలీదళ్, బీజేపీ మధ్య పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.

గురునానక్ జయంతి వేళ ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్.. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది.

దాదాపు ఆరేళ్ల తర్వాత ఇరు పార్టీలు మళ్లీ ఒక్కటవడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పొత్తుతో రాష్ట్రంలో తమ రాజకీయ బలాన్ని పెంచుకోవడంపై రెండు పార్టీలు దృష్టి సారించనున్నాయి.గురునానక్ జయంతి రోజున వెలువడిన ఈ పొత్తు ప్రకటనతో పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు