మన వాళ్లకు రెక్కలు, వెన్నెముక రావాలి!
తెలుగు సమాజంలో ఒకరి ఎదుగుదలను మరొకరు అడ్డుకునే ప్రతికూల ధోరణిపై నటి శోభితా ధూళిపాళ్ల (Actress Sobhita Dhulipalla) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ చేసిన పోస్టుకు స్పందిస్తూ, శోభిత తన మనసులోని మాటను నిర్మొహ మాటంగా పంచుకున్నారు. ఈ పోస్టుకు రిప్లై ఇస్తూ శోభిత తన చిన్న నాటి చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. “నేను కేవలం 16 ఏళ్ల వయసులోనే నా సంచులు సర్దుకుని ముంబైకి వెళ్లిపోయా.
అక్కడ రాణిస్తాననే నమ్మకం ఏమాత్రం లేకపోయినా ఒక ప్రయత్నం చేశా. ఎందుకంటే, ఇక్కడి (తెలుగు రాష్ట్రాల) వాతావరణం కలలు కనేవారిని, రిస్క్ తీసుకునే వారిని తీవ్రంగా జడ్జ్ చేస్తుందని నాకు అప్పట్లోనే అర్థమైంది. నువ్వు ఎంచుకున్న రంగంలో నీకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇక్కడ అస్సలు సహకరించరు. ఇక ఆ ప్రయత్నం చేసేది ఒక మహిళ అయితే, సమాజం నుంచి ఎదురయ్యే వ్యతిరేకత, విమర్శలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి” అని పేర్కొన్నారు శోభిత.
అయితే, ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం నాటి మాట అని చెప్తూ.. ఇప్పటి కైనా పరిస్థితులు మారాయని ఆశిస్తున్నట్లు తెలి పారు. ‘మన తెలుగు కమ్యూని టీలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఎగరడానికి రెక్క’, ఎదురు నిలబడడానికి వెన్నెముక తెచ్చుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ తన సుదీర్ఘమైన కామెంట్‌ను ముగించారు. శోభిత చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ప్రస్తుతం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యాఖ్యలు వంద శాతం నిజమని సమర్థిస్తుండగా, మరి కొందరు తెలుగు సమాజాన్నంతా ఒకే గాటన కట్టి మాట్లాడటం సరికాదని అభిప్రాయ పడుతున్నారు.