6 September, 2026 | 8:24 AM

అనుమతివ్వకున్నా సభ నిర్వహిస్తాం

06-09-2026 | 05:15am

తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు ముజీబ్, శ్యామ్

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాం తి): ఉద్యోగుల సమస్యల(Employee problems) పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని,  ఇక వేచి చూస్తే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ముజీబ్ హుస్సేని(Telangana Employment JAC Deputy Secretary General Mujeeb Hussaini), బి.శ్యామ్(B. Shyam) స్పష్టం చేశారు. ఈనెల 10న ‘చలో హైదరాబాద్(Chalo Hyderabad)’ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా నిర్వహించి తీరుతామన్నారు. వేలాది మంది ఉద్యోగుల(Employees)తో హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేపడుతామని, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

శనివారం నాం పల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ‘చలో హైదరాబాద్’ పోస్టర్ ఆవిష్కరించి, సభ నిర్వహణపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ పోరాటాన్ని కొందరు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చలో హైదరా బాద్ కార్యక్రమానికి వేలాదిగా ఉద్యోగులు  తరలిరావాలని పిలుపునిచ్చారు.  సమావేశంలో ఎస్.విక్రమ్‌కుమార్, ఎం.బి. కృష్ణ యాదవ్, కె.శ్రీకాంత్, డా.రామారావు, శ్రీనే ష్ నోరి, సత్యనారాయణగౌడ్, ఉమారెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు