వారాంతపు సంత ప్రారంభం

21-09-2026 | 07:34pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మండల కేంద్రంలో వారాంతపు సంతను సోమవారం గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ(Village Sarpanch Mamidishetti Suguna) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. ఇకపై ప్రతి సోమవారం మండల కేంద్రంలో వారాంతపు సంత నిర్వహించనున్నట్లు, మండలంలోని వివిధ గ్రామాల రైతులు తాము పండించిన కూరగాయలు, పంట ఉత్పత్తులను సంతకు తీసుకువచ్చి నేరుగా విక్రయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలు తదితరాలను ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతుందని కాబట్టి రైతులు, వ్యాపారులు, ప్రజలు వారాంతపు సంతను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు