21 August, 2026 | 1:29 AM

ఎవరిదీ పైచేయి..?

21-08-2026 12:49 AM
  1. మేఘన్న వైపా.. చిన్నన్న వైపా? 
  2. తుది నిర్ణయానికి హైకమాండ్ మద్దతు ఉంటుందా? 
  3. సర్దుబాటా.. సమరమా? 
  4. డీసీసీ మౌనం వెనుక అంతర్యం ఏమిటి? 
  5. చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులంటూ ప్రచారం 

వనపర్తి, ఆగస్టు 20 (విజయక్రాంతి) : వనపర్తి కాంగ్రెస్లో నెలకొన్న రాజకీయ పంచాయతీ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. మేఘన్నచిన్నన్న మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వివాదానికి పార్టీ అధిష్ఠానం ఎలాంటి ముగింపు పలుకుతుందన్న దానిపైనే అందరి చూపు నిలిచింది.

మేఘన్న వైపా.. చిన్నన్న వైపా? 

ఈ పంచాయతీలో చివరికి ఎవరిదీ పైచేయి అవుతుందన్నది అనేది ఇప్పుడు వనపర్తి జిల్లాలో ప్రధాన చర్చగా మారింది. ఇరువర్గాలకు ఉన్న రాజకీయ బలం, పార్టీ నాయ కత్వంతో ఉన్న సంబంధాలు, వారి వెంట నిలిచే నాయకులుకార్యకర్తల సంఖ్యపై కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే అసలు బలాబలాలు తేలేది పార్టీ అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హైకమాండ్ ఎవరి వైపు నిలుస్తుంది? 

వివాదంపై రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు తెలుపుతుందా? లేక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరువర్గాలతో చర్చలు జరిపి సర్దుబాటు మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకుంటుందా? లేక సీనియర్ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

సర్దుబాటు అయ్యేనా.. సమరం కొనసాగుతుందా? 

వనపర్తి కాంగ్రెస్లో విభేదాలు మరింత ముదరకుండా అధిష్ఠానం ఇరువర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో  ఒకవేళ రాజీ ప్రయత్నాలు విఫలమైతే పరిణామాలు ఏ దిశగా వెళ్తాయన్నదానిపై కూడా రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

డీసీసీ మౌనం వెనుక అంతర్యం ఏమిటి? 

ఈ మొత్తం వ్యవహారంలో డీసీసీ మౌనం మరో ప్రశ్నగా మారింది. వివాదం బహిరంగంగా చర్చకు వచ్చినా జిల్లా పార్టీ నాయకత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం వెనుక కారణమేంటన్న చర్చ జరుగుతోంది. అధిష్ఠానం నిర్ణయం కోసం డీసీసీ ఎదురుచూస్తోందా? ఇరువర్గాల మధ్య తెరవెనుక సర్దుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేక ఏ వర్గానికీ బహిరంగంగా మద్దతు ఇవ్వకుండా పరిస్థితిని గమనిస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులంటూ ప్రచారం ...

ఇదిలా ఉండగా.. చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయంటూ బుధవారం నుండి సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రచారంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ అంశంపై వాస్తవ పరిస్థితి తేలనుంది.

 నాయకుల్లో లెక్కలు.. ప్రజల్లో ఉత్కంఠ 

మేఘన్నచిన్నన్న పంచాయతీపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమతమ రాజకీయ లెక్కలు వేసుకుంటుండగా.. ప్రజలు మాత్రం చివరికి ఎవరిదీ పైచేయి? అని ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీ తుది నిర్ణయం వెలువడిన తర్వాత వనపర్తి కాంగ్రెస్లో రాజకీయ సమీకరణాలు మారుతాయా? ఇరువర్గాలు కలిసి పనిచేస్తాయా? లేక విభేదాలు మరింత ముదురుతాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒక్క నిర్ణయం.. వనపర్తి రాజకీయాల్లో కొత్త మలుపు? 

ఈ పంచాయతీకి అధిష్ఠానం ఇచ్చే తీర్పు ప్రస్తుత వివాదానికి ముగింపు పలకడమే కాకుండా.. వనపర్తి కాంగ్రెస్లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేసే నిర్ణయంగా మారుతుందా? అన్నదే అసలు ప్రశ్న. మేఘన్నదే పైచేయా..? చిన్నన్నదే పైచేయా..? సర్దుబాటు సూత్రమా..? కఠిన నిర్ణయమా..? డీసీసీ మౌనం ఎప్పుడు వీడుతుంది..? వనపర్తి కాంగ్రెస్ పంచాయతీకి అధిష్ఠానం ఎలాంటి ముగింపు పలుకుతుందో.. ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి