థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన

24-10-2026 | 06:59pm

జాతీయ స్థాయికి సనా తబసూమ్‌, మనోజ్‌ కార్తి ఎంపిక

సుల్తానాబాద్‌, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి థాంగ్‌-టా మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో(State-level Thang-Ta martial arts competition) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  ఇండియన్‌ పబ్లిక్‌ పాఠశాల(Indian Public School) విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో పతకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను(Students') పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష(Peddapalli District Collector Koya Sriharsha) అభినందించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సనా తబసూమ్‌, మనోజ్‌ కార్తిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి థాంగ్‌-టా పోటీల్లో అండర్‌-17 బాలుర విభాగంలో మనోజ్‌ కార్తి (-48 కిలోలు) బంగారు పతకం సాధించాడు. సంప్రిత్‌ (-52 కిలోలు), అద్వైత్‌ (-56 కిలోలు), సాత్విక్‌ (-75 కిలోలు) రజత పతకాలు గెలుచుకున్నారు.అండర్‌-17 బాలికల విభాగంలో కృషిక (-75 కిలోలు) రజతం, శ్రీ వర్షిణి (-48 కిలోలు) కాంస్య పతకం సాధించారు. అండర్‌-14 బాలికల విభాగంలో సనా తబసూమ్‌ (-41 కిలోలు) బంగారు పతకం కైవసం చేసుకుంది. 

విద్యార్థుల విజయాల పై పాఠశాల చైర్మన్  సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ , ఉపాధ్యాయులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి లోనూ రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ, వ్యాయామఉపాధ్యాయులు సత్యనారాయణ,సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు