6 September, 2026 | 8:31 AM

దులీప్ ట్రోఫీ ఎవరిదో ?

06-09-2026 | 05:25am
  1. ఫైనల్‌కు ఈస్ట్ జోన్, సౌత్ జోన్ రెడీ 
  2. బరిలో పలువురు స్టార్ ప్లేయర్స్

చెన్నై, సెప్టెంబర్ 5 : ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ (Duleep Trophy)ఫైనల్‌కు అంతా సిద్ధమయింది. ఈ టైటిల్ పోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్, తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ జట్లు తలపడనున్నాయి. చెన్నై చెపాక్ స్టేడియం (Chennai Chepauk Stadium) వేదికగా ఈ ఫైనల్ జరగనుంది. పలువురు స్టార్ ప్లేయర్స్ ఈ ఫైనల్లో ఆడబోతున్నారు. బలాబలాల పరం గా ఇరు జట్లు సమానంగానే కనిపిస్తున్నా యి. హైదరాబాది క్రికెటర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఉన్న సాత్ జోన్ సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

శ్రీలంక సిరీస్‌లో సెంచరీలతో రాణించిన దేవదత్ పడిక్కల్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి రావడంతో సౌత్ జోన్ మరింత బలోపేతమైంది. అయితే, సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఈ ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. కేఎల్ రాహుల్ లేకున్నా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, అద్భుత ఫాంలో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తుది జట్టులోకి రావడం సౌత్ జోన్ క్యాం ప్‌లో ఉత్సాహాన్ని నింపింది.

శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో వరుస సెంచరీలతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన పడిక్కల్ రాకతో తమ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం అయిందని తిలక్ వర్మ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా సెమీస్‌లో తిలక్ సెంచరీతో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు.

మరోవైపు ఇషాన్ కిషన్ సారధ్యంలోని ఈస్ట్ జోన్ కూ డా బలంగా ఉంది. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్‌ను ఓడించి ఫైన ల్‌కు దూసుకొచ్చింది. ఈ జట్టులో మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లతో పాటు యువ సంచలనం వై భవ్ సూర్యవంశీ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.


మరిన్ని వార్తలు