పంచనామాతో నా పదిహేనేళ్ల కల నెరవేరుతోంది

10-09-2026 | 05:30am

‘ప్రేమిస్తే’ మూవీ ఫేమ్ భరత్ శ్రీనివాసన్(Bharat Srinivasan) ప్రధాన పాత్రలో నటించగా, మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రాజెక్టు ‘పంచనామా’. ఈ వెబ్‌సిరీస్‌తో ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను(Udayabhanu) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఉదయభాను ప్రొడక్షన్స్‌(Udayabhanu Productions)పై మిడ్డే విజయేంద్ర మౌళితో కలిసి నిర్మిస్తూ, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారామె. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రీవ్యూ ఈవెంట్(Series Preview Event) హైదరాబాద్‌లో బుధవారం జరిగింది.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. “నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు. దాదాపు 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తున్నా. ఎంతో మంచి కంటెంట్ మోసుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్లానో నాకే తెలుసు. చివరికి ‘జీ’ ఆలోచనలకు తగినట్టు ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. నా బిడ్డల కోసం నేను ఎలాగైతే తాపత్రయపడతానో.. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అంతే తాపత్రయపడ్డా. ఈ ‘పంచనామా’ సిరీస్ కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా” అన్నారు.

హీరో ‘ప్రేమిస్తే’ భరత్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం కంటెంట్ ఈజ్ కింగ్. కొత్త టాలెంట్‌ను ఇలాగే ప్రోత్సహించండి. ఇకపై తెలుగులో మరిన్ని మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తా” అని చెప్పారు. హీరోయిన్ మేధారెడ్డి మాట్లాడుతూ.. “నాలో ఏం చూశారో తెలియదు కానీ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ కష్టపడి పనిచేస్తా” అని చెప్పింది.

డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. “ఉదయభాను నన్ను కలిసి ‘ఇలాంటి నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే మీరైతేనే డీల్ చేయగలరు’ అని నా దగ్గరకు వచ్చినప్పుడు నా తోబుట్టువు నాకు పండుగకు పిలిచినంత ఆనందమేసింది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత విజయేంద్ర మౌళి, నటీనటులు శ్రీజ, సూర్య శ్రీనివాస్, శివ కార్తీక్ దండ, రైటర్ నాగేంద్ర పిల్లా కూడా మాట్లాడారు. చీఫ్ కో డైరెక్టర్ బాలకృష్ణ కట్టా, కాస్ట్యూమ్ డిజైనర్ భావన పోలేపల్లి, సిరీస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు