బోయబస్తీలో దూలానికి ఉరివేసుకొని మహిళ మృతి

19-09-2026 | 07:41pm

తూప్రాన్, సెప్టెంబర్ 19, (విజయక్రాంతి): తూప్రాన్ పట్టణం బోయబస్తీలో (Boyabasti) బండారి నర్సమ్మ, వయస్సు సుమారు 44, అనే మహిళ తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్, ఎస్సై గంగరాజు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించుటకు పరిశీలించడం జరిగింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి క్రమంలో కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు