బతుకమ్మ ఉత్సవాలకు ఏజెన్సీ నుంచి గునుగు పువ్వులు..
ఉట్నూర్ ఏజెన్సీకి తరలివస్తున్న ఇతర జిల్లాలో మహిళలు...
ఉట్నూర్, అక్టోబర్ 05 (విజయక్రాంతి): ఈనెల 10వ తేదీ నుండి ఎంగిలిపూల బతుకమ్మతో(Bathukamma festival) ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలకు అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా దొరికే గునుగు పూల కొరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మహిళలు ప్రత్యేక వాహనాలు తీసుకుని వేకువజామునే ఏజెన్సీకి చేరుకుంటున్నారు.
సోమవారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల ప్రాంతంలోని గ్రామాల మహిళలతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మహిళలు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతానికి చేరుకొని రైతుల చేనులో పెరిగిన గునుగు పువ్వులను సేకరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండలాల పరిధిలోని గ్రామాల్లోని పంట చేనులో పెరిగిన గునుగు పువ్వులను సేకరించి ప్రత్యేక వాహనాలలో తీసుకు వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి పంట చేనులో సేకరించిన గునుగు పువ్వులను సేకరించి, ఉదయం భోజనం చేస్తున్న చిత్రాలు ఇవి...