నేనే బాస్‌పై విచారణ షురూ..
- ఎవరిని సంప్రదిస్తే మేలు జరుగుతుంది..
- బాస్ పక్క చూపులు
- కలెక్టర్‌కు మరో ఫిర్యాదుకు సిద్దమైన మహిళలు
- సమగ్ర విచారణ చేస్తామంటున్న మెప్మా పీడీ
- ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాలంటున్న మహిళల డిమాండ్
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): నేనే బాస్.. నేను చెప్పిందే ఫైనల్ అంటూ ఓ వ్యక్తి మెప్మా(MEPMA)లో చేస్తున్న ఆధిపత్యంపై విజయక్రాంతి దినపత్రిక(Vijayakranthi Newspaper) ప్రత్యేక కథనం ప్రచురితం చేసింది. ఏండ్ల తరబడి మహిళలను వేధిస్తున్న వారిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మహిళలు ప్రత్యేకంగా చెబుతున్న మాట. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. మహిళలను ఒక్కొక్కరిగా వీలైనంతమందిని విచారణ చేసి ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి.
అసలు ఇబ్బందులు గురి చేయవలసిన పరిస్థితిలో ఏమున్నాయి అనే వివరాలు సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. మహిళల సంక్షేమ కోసం మహిళా సంఘాల ఆవిష్కృతం అవుతుంటే వారి ఆర్థిక పరిస్థితులను చిన్నభిన్నం చేసే రీతిలో వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుందని అధికారులు సమగ్ర విచారణకు సిద్ధం అయ్యిండ్రు. ఈ విషయంపై ఇప్పటికే మెప్మా పిడి విజయక్రాంతి దినపత్రికకు సమగ్ర విచారణ చేస్తామని చెబుతుండ్రు.
ఎవరిని సంప్రదిస్తే మేలు జరుగుతుంది
ప్రజాప్రతితులలో అధికారులు చర్యలు తీసుకోకముందే ఎవర్ని సంప్రదిస్తే మేలు జరుగుతుందని బాస్ పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తుంది. రుణాల కోసం వచ్చే మహిళలపై పెత్తనం చేస్తూ 3000 పైగా సంఘాలు ఉన్నాయి 10,12 సంఘాలు ఉంటే ఎంత పోతే ఎంత అనే వ్యవహార శైలితో వారు చేస్తున్న పని ఏం మేరకు నిబద్ధత ఉందో తెలుస్తుంది. మహిళా సంఘాలను పెంచుతూ ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తూ ఆవిష్కృతం చేసిన మహిళా సంఘాల రూపకల్పనలో నిర్లక్ష్య ధోరణి ఎంతవరకు సమంజసమని మహిళలు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. కొన్ని సందర్భాలలో రుణాల కోసం వచ్చే మహిళల ముందే వారి రుణపత్రాలను చించేసిన సంఘటనలు కూడా ఉన్నాయంటే బాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని మహిళలు చెబుతున్న మాట.
వెలుగులోకి కొత్త అంశాలు
మహిళా సంఘాల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తే తవ్వినకొద్దీ వెలుగులోకి కొత్త అంశాలు వచ్చే అవకాశం ఉంది. అసలు ఇన్ని తప్పిదాలు జరుగుతాయా అనే కోణంలో విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళలు పేర్కొంటున్నారు. మహిళా అధికారుల విచారణ చేయాలని అప్పుడే మహిళా సంఘాల సభ్యులకు న్యాయం జరుగుతుందని మహిళలు చెబుతున్న మాట. చర్యలు తీసుకోక ముందే ప్రజా ప్రతినిధులను కలిసి నా తప్పేమీ లేదు వీరంతా నాకు మద్దతుగా ఉన్నారని చెప్పే ప్రయత్నంలో బాస్ ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.
